రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మానవత్వంతో స్పందించారు. నిజామాబాద్‌లో వివిధ కార్యక్రమాలకు హాజరైన ఆయన.. తిరిగి హైదరాబాద్ వస్తుండగా జాతీయ రహదారిపై లారీ-కారు ఢీ కొన్నాయి. గమనించిన మంత్రి ప్రమాదంలో గాయపడిన వారిని తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని తన సిబ్బందిని ఆదేశించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. రోడ్డుపై గల వాహనాలను పక్కకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి స్పందించి ఆస్పత్రిలో చేర్పించడం పట్ల క్షతగాత్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విందు