రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, సత్యవతిరాఠోడ్, జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. రెడ్‌క్రాస్ యాప్‌ను ఆవిష్కరించారు.
ఇవీ చూడండి: 'అవినీతి, భూకబ్జాల్లో తెరాస నేతలు పోటీ పడుతున్నారు'