Prajavani Program in Telangana Today : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రజా సమస్యలు వినేందుకు ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఉదయం 10 గంటల లోపు చేరుకున్న వారే అర్జీ చేసుకునేందుకు అర్హులు అని సర్కార్ తేల్చి చెప్పడంతో ఎలాగైనా 10 గంటల లోపు క్యూలో నిల్చునేందుకు అర్ధరాత్రి బయలుదేరి వస్తున్నారు. ఆనారోగ్య పీడితులు, భూ సమస్యలతో ఇబ్బంది పదుతున్నవారు తమ సమస్యను ముఖ్యమంత్రికి విన్నవించుకుంటేనే పరిష్కారం అవుతాయని, అందుకే వచ్చామని చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జనాలకు ఒక్కొక్కరికి ఒక్కో సమస్య అన్న చందంగా మారింది. వాటి పరిష్కారం కోసం జనాలు ప్రజాభవన్‌కు వస్తున్నారు. నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, ధరణి సమస్యలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావులు తమ భూములు, ఆస్తులు కబ్జా చేశారని ఆరోపిస్తూ ప్రజాభవన్ ఎదుట బాధితులు ధర్నా చేశారు. వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు విన్నవించుకున్నారు.
ప్రజావాణికి భారీ స్పందన- ప్రజాభవన్‌కు బారులు తీరిన ప్రజలు
మరోవైపు 317 జీవో బాధితులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు, ధరణి సమస్యలతో సతమతమవుతున్నారు. తమ గోడు వెళ్లబోసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు. గతంలో బారులు తీరిన జనం, ఇప్పుడు మాత్రం తక్కువ సంఖ్యలోనే వచ్చారు. బారికేడ్లతో ఏర్పాటు చేసిన క్యూలైన్లన్నీ ఖాళీగా కనిపించాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ గతంతో పోలిస్తే తగ్గినట్లుగా అధికారుల భావిస్తున్నారు.
మాది హైదరాబాద్. నేను అక్కడి నుంచే వచ్చాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి ప్రోగ్రామ్ అందరికి ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. ఈ ప్రజావాణి ప్రోగ్రామ్ ద్వారా అయినా మా సమస్యలు పరిష్కారిస్తే చాలా సంతోషం. బాధితులు చాలా మంది ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మా సమస్యలు పరిష్కారం అవుతాయని ఇక్కడికి వచ్చాం." - బాధితుడు
సమస్యల పరిష్కారం కోసం : ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయని ఉద్దేశంతో చలిని సైతం లెక్క చేయకుండా బాధితులు వస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవాడానికి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజావాణి కార్యక్రమంలో మంగళవారం, శుక్రవారం మాత్రమే స్వీకరిస్తుండటంతో ప్రజలు ప్రజాభవన్‌కు తరలివచ్చారు. అలాగే వచ్చినవారికి మౌలిక సదుపాయాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని అర్జీదారులు కోరుతున్నారు. జిల్లాల నుంచి వచ్చే వారికి ఎక్కడ ఉండాలో తెలియక రోడ్ పైనే పడుకుంటున్నామని ఈ సమస్యను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నారు.
ప్రజావాణికి అనూహ్య స్పందన - ప్రజాభవన్ వద్ద చలిలోనే క్యూ కట్టిన ప్రజలు
ప్రజావాణికి ఊహించని స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు