Praja Palana Program in Telangana : హైదరాబాద్‌లో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు.
CM Revanth Reddy Instructions to Collectors : ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమన్వయం లేకపోతే అనుకున్న లక్ష్యం దిశగా ప్రయాణించలేమని పేర్కొన్నారు. సచివాలయంలో జరిగే నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని, చివరి వరసలో ఉన్న పేదలకు సంక్షేమం అందితేనే అభివృద్ధి జరిగిందని చెబుతామని అన్నారు.
ప్రభుత్వం కీలక నిర్ణయం - ఎన్నికలకు ముందు మంజూరై ఉన్న, ప్రారంభం కానీ పనుల నిలిపివేత
CM Revanth Reddy Meeting with Collectors and SP's : కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమే కానీ, నిర్లక్ష్యం చేస్తే సమీక్షించాల్సి ఉంటుందని రేవంత్ రెడ్డి(Revanth Reddy Instructions to Collectors) హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు స్థానిక భాష నేర్చుకోవాలని సూచించారు. అధికారులు జవాబుదారీగా పని చేసి ప్రజల మనసు గెలుచుకోవాలన్నారు. ప్రజల సమస్యలను మానవీయ కోణంలో చూసి పరిష్కరించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజలు ఏదైనా సహిస్తారు కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరని హెచ్చరించారు.
"డ్రగ్స్ నిషేదానికి పోలీసులు అవసరమైన చర్యలు చేపట్టాలి. గంజాయి అనే పదం రాష్ట్రంలో వినపడకూడదు. డ్రగ్స్, గంజాయి కేసుల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించకండి. పోలీసులకు సంపూర్ణ అధికారాలు ఇస్తున్నాం. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోతున్నారు.ఇవి అమ్మేవారిపై ఉక్కుపాదం మోపాలి. అన్ని గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించి, ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించాలి. "-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించి - రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు : సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy Orders to Collectors and SPs : ప్రజలతో గౌరవం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. ఎంతటివారినైనా ఇంటికి పంపించే చైతన్యం తెలంగాణ ప్రజల్లో ఉందని అన్నారు. తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి, ప్రజల చైతన్యం గుర్తుపెట్టుకొని పని చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Telangana Deputy CM Bhatti Vikramarka), మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.
విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట, గజ్వేల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి : సీఎం రేవంత్ రెడ్డి