ETV Bharat / state

ప్రజాపాలనకు విశేష స్పందన- తొలిరోజు 7,46,414 అప్లికేషన్లు

Praja Palana First Day Applications Telangana 2023 : ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి తొలిరోజు భారీ స్పందన వచ్చింది. ఐదు గ్యారెంటీ పథకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే, 7 లక్షల 46 వేల 414 దరఖాస్తులు అందాయి. పథకాల నిబంధనలపై అయోమయంతో కొంత గందరగోళం ఏర్పడింది. యంత్రాంగం నుంచి సరైన సమాచారం రాక పలు ప్రాంతాల్లో దరఖాస్తులు బయట కొనుగోలు చేశారు. మొదటిరోజు సదస్సులు విజయవంతం అయ్యాయన్న సీఎస్ శాంతికుమారి, దరఖాస్తులు ఉచితంగా ఇస్తామని బయట అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Praja Palana Scheme Telangana 2023
Praja Palana Scheme
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 7:03 AM IST

ప్రజాపాలనకు విశేష స్పందన- తొలిరోజు ఎన్ని అప్లికేషన్స్‌ వచ్చాయంటే!

Praja Palana First Day Applications Telangana 2023 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రజాపాలన సదస్సులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. ఐదు గ్యారంటీ పథకాల కోసం నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల 46 వేల 414 దరఖాస్తులు వచ్చాయి. నిన్న 2 వేల 50 పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లోని 2 వేల 10 వార్డుల్లో సదస్సులు జరిగాయి. మొత్తం 17 లక్షల 24 వేల 557 కుటుంబాల పరిధిలో సదస్సులు నిర్వహించగా, 7 లక్షల 46 వేల 414 దరఖాస్తులు వచ్చాయి.

గ్రామీణ ప్రాంతాల నుంచి 2 లక్షల 88 వేల 711 దరఖాస్తులు రాగా, జీహెచ్​ఎంసీలో లక్షా 98 వేలు, రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 2 లక్షల 59 వేల 694 దరఖాస్తులు అందాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని వార్డులు డివిజన్లలో సదస్సులు జరిగాయి. ఉపముఖ్యమంత్రి, మంత్రులు వివిధ ప్రాంతాల్లో జరిగిన సదస్సుల్లో పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం - ఐదు గ్యారంటీల దరఖాస్తులు ఇచ్చేందుకు పోటెత్తిన జనం

గ్రేటర్ హైదరాబాద్‌లోనూ తొలిరోజు దరఖాస్తులు పోటెత్తాయి. బల్దియాలోని 2 లక్షల 39 వేల 739 కుటుంబాల పరిధిలో సదస్సులు నిర్వహించగా, లక్షా 98 వేల దరఖాస్తులు వచ్చాయి. అందులో అభయహస్తం గ్యారంటీల పథకాల కోసం లక్షా 73 వేల 262 దరఖాస్తులు రాగా, 20 వేల 714 మంది ఇతర అవసరాల కోసం సమర్పించారు. ఛార్మినార్ జోన్‌లో 43 వేల 798, ఖైరతాబాద్ జోన్‌లో 28 వేల 68, కూకట్​పల్లి జోన్‌లో 39 వేల 355, ఎల్బీనగర్ జోన్‌లో 31 వేల 513, సికింద్రాబాద్ జోన్‌లో 31 వేల 414, శేరిలింగంపల్లి జోన్‌లో 19 వేల 828 దరఖాస్తులు అందినట్లు జీహెచ్​ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు.

Praja Palana Program First Day Response : రాష్ట్రంలోని 141 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో 2 వేల 358 వార్డు సభలు నిర్వహించారు. ప్రజాపాలన కోసం పురపాలక కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రజాపాలనపై ప్రజలు, నగర పాలక సంస్థల అనుమానాలు నివృత్తి చేసేందుకు హైదరాబాద్‌లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫిర్జాదిగూడ, బోడుప్పల్, పోచారంలో ప్రజా సదస్సులను పురపాలక శాఖ డైరెక్టర్ హరిచందన పరిశీలించారు.

మాది దొరల సర్కార్ కాదు, ప్రజా ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టి

Huge Response For Praja Palana in Telangana : గ్రేటర్ హైదరాబాద్‌లో పరిధిలో ముందుగానే దరఖాస్తులు అందక, ఉదయం నుంచే ప్రజలు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇంటర్నెట్, జిరాక్స్ కేంద్రాల వద్ద దరఖాస్తులు కొనుగోలు చేశారు. ఒక్కో ఫారాన్ని రూ.30 నుంచి రూ.100 వరకు అమ్మారు. పథకాల నిబంధనలపై దరఖాస్తుదారుల్లో కొంత అయోమయం నెలకొంది. ఇప్పటికే లబ్ధి పొందుతున్న పథకాలకు మళ్లీ దరఖాస్తు చేయాలా వద్దా? కుటుంబం అంతా ఒకే దరఖాస్తు చేయాలా? ఒక్కో పథకానికి ఒక్కొక్కరు వేర్వేరుగా దరఖాస్తు చేయాలా? వంటి అనుమానాలు ఎక్కువగా ప్రజల్లో కనిపించాయి. ఒక్కో కేంద్రంలో ఒక్కో అధికారి ఒక్కో తీరుగా వివరించడం కొంత గందరగోళానికి దారితీసింది. ఇప్పటికే ఫించన్లు పొందుతున్నవారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, రైతుభరోసా కోసం మళ్లీ దరఖాస్తు చేయాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా తెలిపారు.

ప్రజాపాలన కార్యక్రమంలో గలాటా - ఎంపీపీ, ప్రజల మధ్య వాగ్వాదం

Praja Palana Telangana 2023 : : మొదటి రోజు ప్రజా పాలన సదస్సులు విజయవంతమయ్యాయని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల నుంచి భారీ ఆదరణ లభించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ప్రతీ కేంద్రంలోనూ సరిపోయే విధంగా అభయహస్తం దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని సీఎస్ స్పష్టం చేశారు. అభయహస్తం ఫారాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ వంద మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని శాంతికుమారి స్పష్టం చేశారు. ప్రతీ దరఖాస్తుకు ప్రత్యేక నంబర్ ఇవ్వాలని మరోసారి సూచించారు. ఫారాలను నింపడానికి ఇతర అవసరాలకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు.

నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ - అయిదు పథకాలకు ఒకే అర్జీ

ఎర్రకోటపై కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయం - మోదీ మెడిసిన్​​కు కాలం చెల్లించింది : సీఎం రేవంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.