యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకరావు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం అదనపు హెల్ప్లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, హెచ్టీఎల్టీ లైన్లు దెబ్బతిని అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని సీఎండీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు.
ఉన్నతస్థాయి సమావేశం...
ఈసందర్భంగా అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ విద్యుత్ పునరుద్ధరణ పనులు సమర్థంగా నిర్వహిస్తున్నామన్నామని సీఎండీ వెల్లడించారు. పనులను పర్యవేక్షణ కోసం నోడల్ అధికారులను ఏర్పాటు చేశామన్నారు.
టీఎస్ఎస్పీడీసీఎల్ ఏరియా నోడల్ అధికారి- 9440813856, టీఎస్ఎన్పీడీసీఎల్ నోడల్ అధికారి- 9440811210, టీఎస్ ట్రాన్స్‌కో రాష్ట్ర నోడల్ అధికారి- 9491398550లకు ప్రజలు ఫోన్ చేసి తమ సమస్యలు వివరిస్తే... వాటిని పరిష్కరిస్తారన్నారు.
ప్రత్యేక కంట్రోల్ రూం...
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామన్నారు. 1912 నంబర్‌తో పాటు టీఎస్ఎస్పీడీసీఎల్- 7382072104, 7382072106, 7382071574, టీఎస్ఎన్పీడీసీఎల్- 9440811244, 9440811245లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. తడిసివున్న విద్యుత్ స్థంబాలను, వేలాడే ఎలక్ట్రిక్ వైర్లను తాకవద్దని, ఎక్కడైనా వైర్లు తెగిపడితే... విద్యుత్ శాఖ సిబ్బందికి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రామాంతపూర్‌లో వర్షం నష్టాన్ని పరిశీలించిన కిషన్‌రెడ్డి