విద్యుత్ చట్ట సవరణ బిల్లు 2020పై విద్యుత్ శాఖ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఆ బిల్లుతో ఫెడరల్ స్పూర్తికి విఘాతం కల్గుతుందని అభిప్రాయపడ్డారు. దీని వల్ల వినియోగదారులపై ఛార్జీల భారం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలది ప్రేక్షక పాత్రే అవుతుందని అభివర్ణించారు.
అంతేకాకుండా.. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళుతుందన్నారు. ప్రైవేట్ సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆరోపించారు. క్రాస్ సబ్సిడీ ఎత్తివేస్తారని.. సబ్సిడీని తగ్గించి నగదు బదిలీ ద్వారా చెల్లిస్తారని వివరించారు. అన్నింటికి మించి ఉద్యోగాల్లో కోత కూడా విధించే అవకాశముంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: తడిసిన నయనం.. ఆగని పయనం