ETV Bharat / state

పౌల్ట్రీ ఫెడరేషన్ అవకతవకలపై సమగ్ర దర్యాప్తునకు డిమాండ్

పౌల్ట్రీ రైతులు బషీర్​బాగ్​లోని తమ ఫెడరేషన్​ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పౌల్ట్రీ ఫెడరేషన్​లో తమకు అన్యాయం జరిగిందంటూ వాపోయారు. మొక్కజొన్న సబ్సిడీ చిన్న సన్నకారు రైతులకు అందకుండా కార్పొరేట్​ యాజమాన్యం కాజేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం చొరవచూపి దీనిపై చర్యలు తీసుకోవాలని అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.

బషీర్​బాగ్​లో పౌల్ట్రీ రైతుల అర్ధనగ్న ప్రదర్శన
author img

By

Published : Aug 17, 2019, 7:17 PM IST

పౌల్ట్రీ ఫెడరేషన్​లోని అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ... పౌల్ట్రీ రైతులు హైదరాబాద్​లో ఆందోళనకు చేపట్టారు. బషీర్​బాగ్​లోని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యాలయాల ముందు రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా 6 లక్షల టన్నుల మొక్కజొన్నను పౌల్ట్రీ రైతులకు అందజేసిందని... కానీ చిన్న, సన్న కారు రైతులకు మక్కల పంపకంలో అవినీతి జరిగిందని పౌల్ట్రీ రైతులు ఆరోపించారు. తమకు ఇవ్వాల్సిన మొక్కజొన్నల కేటాయింపులో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని... సబ్సిడీ మక్కలను కార్పొరేట్ వ్యాపారస్తులకు, ప్రైవేటు ట్రేడర్స్​కు అక్రమ మార్గంలో ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కార్యదర్శి మోహన్ రెడ్డి కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఫెడరేషన్ బిల్డింగ్ ఫండ్ పేరుతో నాలుగున్నర కోట్ల రూపాయలు రైతుల నుంచి వసూలు చేసి ఆ నిధులను నొక్కేశారని తెలిపారు. ప్రభుత్వం నుంచి తమకు రావలసిన మొక్కజొన్న వాట రాకపోవడంతో చిన్న, సన్న కారు రైతులు బయట కొనుక్కోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జ్యోక్యం చేసుకొని సబ్సిడీ ద్వారా వచ్చే మక్కలను చిన్న రైతులకు అందించి తమకు న్యాయం చేయాలని కోరారు. తక్షణమే ఫెడరేషన్ నాయకుల పై సీబీఐ విచారణ చేపట్టి.. వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బషీర్​బాగ్​లో పౌల్ట్రీ రైతుల అర్ధనగ్న ప్రదర్శన

ఇదీ చూడండి: ఇవాళ పశువైద్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

Date : 17-08-2019 TG_Hyd_59_17_Poultrey Farmer's Protest_Ab-TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam యాంకర్ : తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ లో జరిగిన అవకతవకల పై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ... పౌల్ట్రీ రైతులు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. బషీర్బాగ్ లోని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యాలయాల ముందు రైతులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా 6 లక్షల టన్నుల మొక్కజొన్న పౌల్ట్రీ రైతులకు అందజేసిందని...కానీ చిన్న సన్న కారు రైతులకు మొక్కల పంపకంలో అవినీతి జరిగిందని పౌల్ట్రీ రైతులు ఆరోపించారు. తమకు ఇవ్వాల్సిన మొక్కజొన్నల కేటాయింపులో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని...సబ్సిడీ మొక్కలను కార్పొరేట్ వ్యాపారస్తులకు , ప్రైవేటు ట్రేడర్స్ కు అక్రమ మార్గంలో ఫెడరేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కార్యదర్శి మోహన్ రెడ్డి లు కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని తెలిపారు. అంతేకాకుండా ఫెడరేషన్ బిల్డింగ్ ఫండ్ పేరుతో నాలుగున్నర కోట్ల రూపాయలు రైతుల వద్ద నుండి వసూలు చేసి ఆ నిధులను నొక్కేశారని తెలిపారు. ప్రభుత్వం నుండి తమకు రావలసిన మొక్కజొన్న వాట రాకపోవడంతో చిన్న సన్న కారు రైతులు బయట కొనుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జ్యోక్యం చేసుకొని సబ్సిడీ ద్వారా వచ్చే మక్కలను చిన్న రైతులకు అందించి తమ కు న్యాయం చేయాలని కోరారు. తక్షణమే ఫెడరేషన్ నాయకుల పై సీబీఐ విచారణ చేపట్టి.. వారి పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బైట్స్: చిన్నకారు పౌల్ట్రీ రైతులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.