రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పత్తి మిల్లులు, వ్యాపారుల సంక్షేమ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. జిన్నింగ్ మిల్లుల వద్ద సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తామని ఆదివారం ఈ సంఘం ప్రకటించింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి స్పందించి నాలుగైదు రోజుల్లో మిల్లుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం వల్ల ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు సంఘం అధ్యక్షుడు బి.రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.రమేశ్ తెలిపారు.
కొత్తగా ఏర్పాటైన మిల్లులకు ప్రభుత్వం నుంచి రాయితీ నిధులు రావాల్సి ఉందన్నారు. ఇవి కాక ప్రోత్సాహకాల సొమ్ము రానందున పత్తి కొనుగోలు ఆపేయాలని నిర్ణయించారు. కానీ నాలుగైదు రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు.
ఇదీ చూడండి : డ్వాక్రా మహిళలకు వారంలోనే రుణం