ETV Bharat / state

Postal Ballot for 13 Another Departments Employees : మరో 13 శాఖల ఉద్యోగులకూ 'పోస్టల్ బ్యాలెట్'.. ఇకపై ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే వినియోగం

Postal Ballot for 13 Another Departments Employees : పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్లను పోలింగ్ కంటే ముందే ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల సిబ్బందితో పాటు అత్యవసర సేవలు, ఎన్నికల విధుల్లో పాల్గొనే మరో 13 కేటగిరీలకు కూడా ఈసీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించింది. సర్వీసు ఓటర్లు ఈటీపీబీఎంఎస్ విధానంలో పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోవాల్సి ఉంటుంది.

Use of Postal Ballot in Improving Voter Turnout
Postal Ballot Opportunity for Election Duty Employees
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 11:02 AM IST

Postal Ballot for 13 Another Departments Employees : అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశాన్ని తొలిసారిగా 13 శాఖల ఉద్యోగులకు విస్తరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవల్లో(Emergency Services) ఉండేవారికి, ఎన్నికల విధుల్లో ఉండే వివిధ విభాగాల వారికి కూడా ఈ సదుపాయాన్ని కల్పించింది. గతంలో ఉన్న ఈ పోస్టల్ బ్యాలెట్ విధానం ప్రకారం..​ పోస్టల్​లో వచ్చిన బ్యాలెట్​ ఓటును సిబ్బంది తమ వద్దే ఉంచుకొని రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో బేరసారాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. దీంతో పోస్టల్ బ్యాలెట్లు కలిగిన వారు ఒక్కో మారు ఎన్నికల ఫలితాన్ని నిర్ధేశించే పరిస్థితి ఏర్పడుతుంది. పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించిన ఈసీ.. ఈ విధానంలో మార్పులు, చేర్పులు చేసింది.

ఈసీ అవకాశం కల్పించిన శాఖలు వరుసగా..: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే(Indian Railway), ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, రాష్ట్ర రవాణా సంస్థ, పౌర సరఫరాల శాఖ, బీఎస్ఎన్ఎల్, పోలింగ్ కవరేజ్ కోసం ఈసీఐ ధ్రువీకరించిన మీడియా ప్రతినిధులు, అగ్నిమాపక శాఖ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ శాఖలు, విభాగాలకు చెందిన వారు పోలింగ్ రోజు విధుల్లో ఉంటే వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వర్తిస్తుంది.

పాత్రికేయులకు ఇక పోస్టల్​ బ్యాలెట్.. ఆ ఉద్యోగులకు కూడా...

Method of Using Postal Ballot : ఇందుకోసం ఆయా శాఖలు, విభాగాల్లో నోడల్ అధికారులను(Nodal Officers) నియమిస్తారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకునే వారు 12 డీ ఫారంలో వివరాలు పొందుపర్చి నోడల్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. నోడల్ అధికారి వాటిని పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు పంపిస్తారు. ఈ తరహాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలనుకునే వారి ఫారం 12 డీ పూర్తి వివరాలతో నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి ఐదు రోజుల్లోపు రిటర్నింగ్ అధికారికి చేరాల్సి ఉంటుంది. వాటిని ఆర్ఓ పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తారు.

Postal Ballot New Regulations : మారిన నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమ పోస్టల్‌ బ్యాలెట్‌ను తమ వద్దే ఉంచుకోకుండా.. సిబ్బందికి ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారందరూ విధిగా ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే తమ ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అక్కడే బ్యాలెట్ తీసుకొని ఎన్నికల విధులకు వెళ్లే ముందే వారు తమ ఓటుహక్కు వినియోగించుకొని అక్కడే రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం 13ఏ ఫారంపై సంతకం చేసి ఏ గ్రూప్ లేదా బీ గ్రూప్ అధికారి సమక్షంలో ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుంది.

106+ ఏజ్​లో మళ్లీ ఓటు వేసేందుకు సిద్ధం.. పోలింగ్ బూత్​లో రెడ్​ కార్పెట్​ వెల్​కమ్

Postal Ballot Improves Voting Percentage : సర్వీసు ఓటర్లుగా పరిగణించే త్రివిధ దళాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది. వీరి కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్(ఈటీపీబీఎస్)ను వినియోగిస్తారు. సర్వీసు ఓటర్లు తమకు సంబంధించిన నియోజకవర్గాల బ్యాలెట్ పత్రాలను ఈటీపీబీఎస్ పోర్టల్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. బ్యాలెట్​పై తమ ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం స్పీడ్ పోస్ట్ ద్వారా బ్యాలెట్​ను సంబంధిత రిటర్నింగ్ అధికారికి పంపవచ్చు.

ఎన్​ఆర్​ఐలకు గుడ్​న్యూస్.. త్వరలో 'పోస్టల్​ బ్యాలెట్'​ సౌకర్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.