వాహనాలు, చెత్త కాల్చడం, రోడ్లు, నిర్మాణాలు తదితర కార్యకలాపాల వల్ల నిత్యం గాల్లోకి 40 రకాల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతుంటాయి. ఈ జాబితాలో హైదరాబాద్ సహా దేశంలోని ఇతర మెట్రో నగరాలను వణికిస్తున్న పీఎం 10, పీఎం 2.5 అత్యంత ముఖ్యమైనవి. మన తల వెంట్రుక మందం 50 మైక్రోగ్రాములుంటుంది. ఇందులో ఇరవయ్యో వంతుండే పీఎం 2.5 కంటికి కనిపించదు. ఊపిరితిత్తుల్లోకి చేరి అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. వెంట్రుక మందంలో అయిదో వంతుండే పీఎం 10.. స్వచ్ఛమైన గాలిని కలుషితంగా చేస్తుంది. ఆ వాతావరణంలో ఎక్కువ సేపు గడిపితే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకిలా..
నగరంలోని వివిధ ప్రాంతాల్లో పీసీబీ వాయు కాలుష్య నమోదు కేంద్రాలను నిర్వహిస్తోంది (Telangana State Pollution Control Board). ఆయా కేంద్రాల్లో ఆగస్టు, సెప్టెంబర్‌లో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే పీఎం 10 తీవ్రత ఒకటి, రెండు మినహా అన్ని ప్రాంతాల్లోనూ తగ్గింది. పీఎం 2.5 పరిస్థితి కూడా అంతే. పీఎం 2.5 సనత్‌నగర్‌లో 23 ఎంజీల నుంచి 18 ఎంజీలకు తగ్గింది. వేసవిలో వాతావరణం పొడిగా ఉంటుంది. గాల్లోకి వెలువడిన కాలుష్య ఉద్గారాలు అటు.. ఇటు ప్రయాణిస్తుంటాయి. అదే శీతాకాలం విషయానికొస్తే మంచు ఉండటం వల్ల ఎటూ కదలకుండా భూమిపై కొద్ది మీటర్ల ఎత్తులోనే ఉండిపోతాయి. ఫలితంగా వేసవి, వర్షాకాలాలతో పోలిస్తే శీతాకాలంలో కాలుష్యం అధికంగా ఉంటుంది. వర్షం కురిసినప్పుడు కాలుష్య ఉద్గారాలు నీటి బిందువులతో కలిసి భూమిపైకి చేరుకుంటాయి. రోడ్లు కూడా తడిగా ఉండటంతో వాటి నుంచి వెలువడే దుమ్ము కూడా తగ్గిపోతుంది. ఫలితంగా మిగిలిన కాలాలతో పోలిస్తే వానకాలంలో కాలుష్యం తక్కువగా నమోదవుతుందని పీసీబీ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
నిర్దేశిత పరిమితులిలా..
ఇదీ చూడండి: Ek Shaam Charminar ke Naam: సందర్శుకులతో కళకళలాడిన చార్మినార్