మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకుని పలువురు రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ బాపూఘాట్ వద్ద నివాళులు అర్పించారు. భారతదేశానికి మహాత్ముడు చేసిన సేవలను కొనియాడారు.
హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద మహాత్మాగాంధీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాళులు అర్పించారు.
మహాత్ముడి ఆశయాల కోసం దేశ పౌరులు, యువత కృషి చేయాలని దత్తాత్రేయ సూచించారు. గాంధీ ఆశయాలు కొనసాగించడమే ఆయనకు ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.
విశ్వశాంతికి కృషి చేసిన జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శప్రాయుడని పలువురు ప్రముఖులు కొనియాడారు.