ETV Bharat / state

సతీశ్​ బాబు హత్య కేసును ఛేదించిన పోలీసులు - venkanteswar rao

హైదరాబాద్​లో కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ సంస్థ ఎండీ సతీశ్​ బాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. మిత్రుడు హేమంతే పథకం ప్రకారం సతీష్‌ను దారుణంగా అంతమొందించినట్లు తేల్చారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితుడు యత్నించిన్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.

వెంకటేశ్వర్‌రావు
author img

By

Published : Sep 5, 2019, 5:26 PM IST

ప్రకాశం జిల్లా మార్టూరు గ్రామానికి చెందిన సతీశ్​ బాబు హైదరాబాద్‌లోని ముసాపేట్‌లో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ సంస్థను నిర్వహిస్తున్నాడు. అతని మిత్రుడు భీమవరానికి చెందిన హేమంత్ కొంతకాలంగా సతీశ్​ వద్దనే పనిచేస్తూ సంస్థలో భాగస్వామ్యం కలిగి ఉన్నాడు. వారి సంస్థలో పనిచేసే ప్రియాంక హేమంత్​తో చనువుగా ఉండేది. ప్రియాంకతో కలిసి చనువుగా ఉండవద్దని హేమంత్‌ను పలుమార్లు సతీశ్​ హెచ్చరించాడు. సాఫ్ట్‌వేర్ సంస్థ నష్టాల్లో ఉండడం వల్ల హేమంత్‌కు ఇచ్చే వేతనం తగ్గించాడు.

ప్రణాళికతోనే హత్య

ఇదంతా మనసులో పెట్టుకున్న హేమంత్​.. సతీశ్​ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 28న ఇద్దరు హేమంత్ ఇంటి వద్ద మద్యం సేవించారు. మత్తులో ఉన్న సతీశ్​ను హేమంత్​ ఇనుప సుత్తితో తలపై మోదీ చంపేశాడు. హత్యను ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు హేమంత్‌ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ప్రియాంక ప్రమేయం, హేమంత్​కు ఇంకెవరైనా సహకరించారా అనే అంశాలపై విచారణ చేస్తున్నామని డీసీపీ వివరించారు.

సతీశ్​ బాబు హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఇవీ చూడండి : లక్షల్లో లావాదేవీలు... కోట్లలో స్వాహా

TG_Hyd_43_05_Saftwere_MD_Murder_Arrest_AB_3066407 Reporter: K.Srinivas Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ సంస్థ ఎండీ సతీష్ బాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతని మిత్రుడు హేమంత్ పథకం ప్రకారం సతీష్‌ను దారుణంగా అంతమొందించినట్లు పోలీసులు తేల్చారు. ప్రకాశం జిల్లా మార్టూరు గ్రామానికి చెందిన సతీష్‌ బాబు హైదరాబాద్‌లోని ముసాపేట్‌లో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ సంస్థను నిర్వహిస్తున్నాడు. అతని మిత్రుడు బీమవరానికి చెందిన హేమంత్ సతీష్ వద్దనే పనిచేస్తూ సంస్థలో భాగస్వామ్యం కలిగి ఉన్నాడు. సతీష్ సంస్థలో పనిచేసే ప్రియాంక హేమంత్ తో కూడా చనువుగా ఉండేది. అయితే ప్రియాంకతో కలిసి చనువుగా ఉండవద్దని సతీష్‌ హేమంత్‌కు తెలిపాడు. సాఫ్ట్‌వేర్ సంస్థ నష్టాల్లో ఉండడంతో హేమంత్‌కు ఇచ్చే నెలవారి వేతనం తగ్గించాడు. దీంతో సతీష్‌ను ఎలాగైనా హత్య చేయాలని హేమంత్ పథకం వేశాడు. గత నెల 28న సతీష్ హేమంత్ ఇంటివద్దకు వచ్చిన సమయంలో ఇద్దరు కలిసి మద్యం సేవించిన తర్వాత హేమంత్ ఇనుప సుత్తితో సతీష్ తలపై గట్టి మోదీ చంపివేశాడు. అనంతరం అతని గొంతు కూడా కోశాడు. హత్య జరిగిన తర్వాత ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు మాధాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు హేమంత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం ఘటనలో ప్రియాంక ప్రమేయం ఉందా హేమంత్ కు ఇంకెవరైనా సహకరించారా అనే అంశాలపై విచారణ కొనసాగిస్తున్నట్లు అయన వివరించారు. బైట్: వెంకటేశ్వర్‌రావు, మాదాపూర్ డీసీపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.