Huge Amount of Money Seized in Telangana 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు, మద్యం, ఆభరణాలు, కానుకల విలువ మొత్తం రూ.300 కోట్లు దాటింది. ఎన్నికల షెడ్యూల్(Telangana Election Schedule) వచ్చిన ఈ నెల 9వ తేదీ నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం, మత్తు పదార్థాలు, బంగారం, వెండి, ఆభరణాలు, కానుకల విలువ రూ.307 కోట్ల 2 లక్షలకు పైగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ప్రకటించారు.
Police Checking in Telangana 2023 : గడచిన 24 గంటల్లో రూ.9.69 కోట్ల నగదు పట్టుబడగా.. ఇప్పటి వరకు రూ.105.58 కోట్ల నగదు పట్టుబడింది. శుక్రవారం ఉదయం నుంచి రూ.కోటి 35 లక్షల విలువైన మద్యం పట్టుబడగా.. స్వాధీనం చేసుకున్న మొత్తం సరుకు విలువ రూ.13.58 కోట్లు. అలాగే 24 గంటల్లో రూ.72 లక్షల విలువైన 232 కిలోల గంజాయి పట్టుబడింది. ఇప్పటి వరకు మొత్తం రూ.15.23 కోట్ల విలువైన 3,672 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గడచిన 24 గంటల్లో రూ.3.81 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. ఇప్పటి వరకు మొత్తంగా 202 కిలోల బంగారం, 894 కిలోల వెండి, 190 క్యారట్ల వజ్రాలు, ఐదు గ్రాముల ప్లాటినం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.145.67 కోట్ల. అదేవిధంగా వీటితో పాటు రూ.26.93 కోట్ల విలువైన ఇతర కానుకలు పట్టుబడ్డాయి. అక్టోబరు 20 ఉదయం నుంచి 24 గంటల్లో పట్టుబడిన సరుకు మొత్తం విలువ రూ.18.01 కోట్లు.
ఇప్పటికీ వరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు :
వస్తువు | 24 గంటల్లో పట్టుబడిన మొత్తం | మొత్తం సరుకు |
నగదు | రూ.9.69 కోట్ల | రూ.105.58 కోట్ల |
మద్యం | రూ.కోటి 35 లక్షల | రూ.13.58 కోట్లు |
గంజాయి | రూ.72 లక్షలు(232 కిలోలు) | రూ.15.23 కోట్లు(3,672 కిలోలు) |
బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం | రూ.3.81 కోట్లు | రూ.145.67 కోట్లు |
10 రోజుల్లో ఇతర కానుకలు మొత్తం విలువ | - | రూ.26.93 కోట్ల |
ఒక్క రోజులో మొత్తం సరుకు | - | రూ.18.01 కోట్లు |
మరోవైపు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో.. హైదరాబాద్ జిల్లాలోని అన్ని బ్యాంకు మేనేజర్లతో సమావేశమైన ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఎన్నికల నిబంధనలను వివరించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో డిజిటల్ లావాదేవీలు, లెక్కకు మించిన నగదు ఉన్న ఖాతాలపై నిఘాపెట్టాలని సూచించారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని.. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఎన్నికల నోడల్ ఆఫీసర్‌కు పంపించాలని ఆదేశించారు.
Telangana Assembly Elections 2023 : ఏటీఎమ్‌లలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చే వాహనాలు, ఆయా బ్యాంకులకు తప్పనిసరిగా జీపీఎస్‌ను ఏర్పాటుచేసి వాహనాలను పరిశీలించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, నేతలు లక్షకు మించిన లావాదేవీలు చేస్తే సమాచారం అందించాలని ఎన్నికల అధికారి ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనాలపై విమర్శలు వెల్లువెత్తుడంటంతో.. ఎన్నికల సంఘం ఈ చర్యలు చేపట్టింది.