ETV Bharat / state

Police Seize Huge Amount of Gold and Money : రాష్ట్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు.. ఇప్పటివరకు రూ. 37 కోట్లకు పైగా జప్తు

Police Seize Huge Amount of Cash : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో.. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో.. 37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం విలువ 12 కోట్లకు పైగా ఉంది.

Telangana Election Code Seizures
Police Seize Huge Amount of Gold and Money
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 9:28 PM IST

Telangana Election Code Seizures : కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ఆదేశాలతో అధికార, పోలీసు యంత్రాంగం.. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్నికల కోడ్​ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు చేపడుతున్నారు. అనేక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీల్లో ప్రతి రోజూ కోట్ల కొద్దీ నగదు, మద్యం బాటిళ్లు బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో.. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఈ రోడు వరకు.. 37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారు, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

Cash Seized During Police Check in Hyderabad : ఎన్నికల కోడ్‌ అమలు.. 3 రోజుల్లోనే.. భారీ స్థాయిలో నగదు స్వాధీనం

Telangana Assembly Elections 2023 : ఇందులో నిన్న ఒక్క రోజే ఉదయం నుంచి ఇప్పటి వరకు పట్టుబడిన మొత్తం విలువ 12 కోట్లకు పైగా ఉంది. జీహెచ్​ఎంసీ పరిధిలో బాలానగర్‌లో 10 లక్షలు, చైతన్యపురి ఎక్స్‌ రోడ్డులో 33.50 లక్షలు జప్తు చేశారు. కూకట్‌పల్లి పరిధి ప్రశాంత్‌నగర్‌, మూసాపేట్‌, భాగ్యనగర్‌ కాలనీల్లో సరైన పత్రాలు లేని 8 మంది వాహనదారుల నుంచి 21.69 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 6.27 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. 31.36 లక్షల విలువైన మద్యం, 67.64 లక్షల విలువైన డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు. ఇక రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్​ అమల్లోకి వచ్చినప్పటి నుంచి.. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు 20.43 కోట్ల రూపాయలు కాగా.. 86.92 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 89.02 లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.

Election Code Raids in Telangana : ఎలక్షన్​ కోడ్(Telangana Assembly Elections 2023)​ అమలైన ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు 31 కిలోలకు పైగా బంగారం, 350 కిలోల వెండి, 42 క్యారట్ల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం 14.65 కోట్ల రూపాయలు ఉంటుది. అందులో 24 కిలోల బంగారం, 42 క్యారట్ల వజ్రాలు నిన్నటి నుంచి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నవే. ఈ రోజు వరకు 22.51 లక్షల విలువైన ల్యాప్​టాప్​లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

శాంతిభద్రతల్లో భాగంగా ఇప్పటి వరకు 1196 మందిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్రానికి వంద కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను కేటాయించారు. కేంద్ర బలగాలు ఈ నెల 20వ తేదీ వరకు విధుల్లో చేరనున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా 75 వేలకు పైగా ప్రజల, ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి, వాటిపై ప్రచార సామాగ్రి తొలగింపు కేసులు నమోదయ్యాయి.

Police Seized Gold and Money in Hyderabad : హైదరాబాద్​లో పోలీసుల తనిఖీలు.. భారీగా బంగారం, నగదు స్వాధీనం

Implementation of Election Code in Telangana : రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలు.. పోలీసుల తనిఖీలు షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.