Saikrishna statement in Apsara murder case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో శంషాబాద్ గ్రామీణ పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. నిందితుడు సాయికృష్ణను వెంట పెట్టుకొని హత్య జరిగిన స్థలానికి పోలీసులు వెళ్లారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ వద్ద కారులో అప్సరను హత్య చేసిన చోటును పరిశీలించారు. అక్కడ అప్సరను సాయి కృష్ణ ఎలా హత్య చేశాడో నిందితుడ్ని అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత నేరుగా సరూర్‌నగర్ వెళ్లారు. మ్యాన్‌హోల్‌లో అప్సర మృతదేహాన్ని పడేసిన చోటుకు సాయికృష్ణను తీసుకెళ్లారు. అక్కడ మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో ఎలా పడేశాడో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహం పడేసిన రెండు రోజుల తరువాత సాయికృష్ణ, మ్యాన్‌హోల్‌ను మట్టితో నింపి ఆ తర్వాత సిమెంట్‌తో కాంక్రీట్ వేశాడు. మ్యాన్ హోల్ మట్టి వేసిన కూలీలను పోలీసులు ఘటనా స్థలానికి పిలిపించారు. ఇద్దరు కూలీలతో కలిపి సాయికృష్ణను ప్రశ్నించారు. మ్యాన్‌హోల్ పూడ్చే సందర్భంగా సాయికృష్ణ చెప్పిన మాటలను కూలీలు.. పోలీసుల ఎదుట వివరించారు.
- Apsara Murder Case Update : అప్సర హత్య కేసు.. ఆ తప్పే సాయికృష్ణను పట్టించేసింది
- Apsara Case Remand Report : "How to Kill human being" అని గూగుల్‌లో సెర్చ్ చేసిన సాయికృష్ణ
Saroornagar Apsara Murder News : మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తోందని మట్టి పోయాలని సాయికృష్ణ చెప్పిన మాటలను ఇద్దరు కూలీలు వివరించారు. కూలీల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. వనస్థలిపురం ఇసుక అడ్డ వద్దకు వెళ్లి గుంత పూడ్చడానికి కావలసిన ఎర్రమట్టిని తీసుకువచ్చేందుకు కూలీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కూలీలకు సగం డబ్బులు మాత్రమే ఇచ్చినట్లు.. మిగతా డబ్బుల కోసం ఫోన్ చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.
అనంతరం సరూర్‌నగర్‌లో ఉన్న సాయి కృష్ణ నివాసానికి నిందితుడ్ని తీసుకొచ్చారు. సాయికృష్ణను పోలీసు వాహనంలోనే కూర్చోపెట్టారు. పోలీసులు మాత్రం అపార్ట్మెంట్లోకి వెళ్లి కుటుంబ సభ్యులను విచారించినట్లు తెలుస్తోంది. పోలీస్ వాహనంలోనే కూర్చున్న నిందితుడు సాయికృష్ణతో ఆయన తండ్రి కొద్ది నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. అప్సర హత్య కేసులో భాగంగా నిందితుడు సాయికృష్ణ రెండు రోజుల కస్టడీ రేపటితో ముగుస్తుంది. రంగారెడ్డి జిల్లా కోర్టులో సాయికృష్ణను హాజరుపరిచి అనంతరం చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.
ఇది జరిగింది: తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేసిన యువతిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్న పూజరి సాయికృష్ణ.. ఈ నెల 4వ తేదీన ఉదయం 3.30 గంటల సమయంలో శంషాబాద్ సమీపంలోని నర్కుడలో హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి సరూర్‌నగర్‌లోని ఓ సెప్టిక్ ట్యాంకులో వేసి కాంక్రీటుతో మూసేశాడు. అప్సర ఏమైందని సాయికృష్ణని ఆమె తల్లి ప్రశ్నించగా.. స్నేహితులతో భద్రాచలం వెళ్లిందని నమ్మించాడు.
రెండు రోజులైనా అప్సర ఆచూకీ లేకపోవడంతో ఆమె తల్లికి తనపై అనుమానం రాకుండా 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ ఫిర్యాదు చేశాడు. రాత్రి 10.20 గంటలకు అప్సరను శంషాబాద్ బస్టాండు దగ్గర ఆమె స్నేహితుల కారులో పంపించానని.. ఆ తర్వాత నుంచి అదృశ్యమైందని ఫిర్యాదులో రాశాడు.
ఇవీ చదవండి: