తాను ఎప్పుడూ ఉన్నత పోస్టుల కోసం పాకులాడలేదని పోలీసు ముద్రణా విభాగం డీజీ వీకే సింగ్ అన్నారు. తనకు మంచి పోస్టు రాకపోవడం వల్ల రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. పోలీసు ముద్రణా విభాగంలో ఎలాంటి పనిలేదని దానిని మూసివేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విభాగంలో ఖర్చు ఎక్కువగా ఉండి... ఆదాయం తక్కువగా ఉందని అన్నారు. ప్రజా మిత్ర పోలీసింగ్ మంచి ఉద్దేశమే కానీ... ప్రజల్లో పోలీస్ స్టేషన్ అంటే భయం పోవాలని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల జీవితాల్లో సంతోషం నింపడమే తన లక్ష్యమని వెల్లడించారు.
ఇదీ చూడండి : 'కేంద్రం చొరవ చూపితే... గల్ఫ్ బాధితులకు కష్టాలుండవ్'