హైదరాబాద్ గచ్చిబౌలి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పోలిస్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలిస్ పరేడ్లో పాల్గొన్నారు.
పోలీసులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజల రక్షణకు నిరంతరం కృషి చేస్తారని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి 24 గంటలు పనిచేసేది పోలీస్ డిపార్ట్మెంట్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం 264 మంది అమరులయ్యారని పేర్కొన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి పిల్లలకు ఎస్సీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని వెల్లడించారు. ప్రజలు ఎప్పుడూ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: అమరుల త్యాగాలను నిరంతరం స్మరించుకుంటాం: సీపీ