మరో 15 వేల ఉద్యోగాల భర్తీ
తెలంగాణ పోలీసు శాఖలో మరో 15 వేల ఉద్యోగాల భర్తీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 2015లో పదివేల ఉద్యోగాలు భర్తీచేయగా, 2018లో 18 వేల కొలువుల భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.
ప్రకటన విడుదలైన వెంటనే నియామక ప్రక్రియ
ఇప్పటికే కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు తుది పరీక్ష పూర్తవగా అర్హులైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. వారం రోజుల్లో కటాఫ్ మార్కుల్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు జులై నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. మరో దఫా 15 వేల పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన విడుదలైన వెంటనే నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ పోలీస్ నియామక మండలి తెలిపింది.
ఇవీ చూడండి: నూతన అసెంబ్లీ భూమి పూజ కోసం ఏర్పాట్లు