రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. సహచరుడు మృతి చెందితే.. అతన్ని కుటుంబాన్ని ఆదుకున్నారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ హరీశ్‌కు రెండు నెలల క్రితం కరోనా సోకి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కానిస్టేబుల్‌కు నలుగురు పిల్లలున్నారు.
తోటి సిబ్బంది, కొందరు స్థానికులు కలిసి హరీశ్ కుటుంబానికి ఆర్ధిక సాయం అందించడానికి ముందుకొచ్చారు. అందరూ కలిసి ఎనిమిది లక్షల రూపాయలు సేకరించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ చేతుల మీదుగా హరీశ్ భార్యకు చెక్కు అందజేశారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకున్న సిబ్బందిని సజ్జనార్ అభినందించారు.
ఇదీ చదవండి:భాగ్యనగరంలో కిలో ఉల్లి 35 రూపాయలే