హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డిపై మాల మహానాడు అధ్యక్షుడు దీపక్ కుమార్ ఫిర్యాదు చేశారు. 23 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు ఐకాస నేతలు కారణమని దీపక్ కుమార్ ఆరోపించారు. విలీనం డిమాండ్ వాయిదా వేసుకోవడం వల్ల కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఆర్టీసీ ఐకాస ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 50,000 మంది కార్మికుల ఉద్యమానికి మాల మహానాడు, ఎమ్మార్పీఎస్, బంజారా, గిరిజన, మైనారిటీ సంఘాలు మద్దతుగా నిలిస్తే నాయకులు వెనక్కు తగ్గడం దారుణమన్నారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!