ETV Bharat / state

Police Checkings in Telangana : పోలీసుల విస్తృత తనిఖీలు.. రూ.130 కోట్ల మార్కును దాటేసిన మొత్తం విలువ

Police Checkings in Telangana : శాసనసభ ఎన్నికల నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న డబ్బు, మద్యం, ఆభరణాలు, కానుకలు, మాదక ద్రవ్యాల విలువ మొత్తం రూ.130 కోట్ల మార్కును దాటింది. ఇప్పటి వరకు అన్ని రకాలుగా పట్టుబడిన మొత్తం విలువ రూ.130 కోట్ల 26 లక్షల 91 వేల 531గా అధికారులు వెల్లడించారు.

police caught huge amount in vehicles
Police Checkings in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 17, 2023, 10:00 PM IST

Police Checkings in Telangana : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్​ వెలువడిన నాటి నుంచి పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. నగదు, మద్యం, కానుకల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ.. సరైన పత్రాలు లేని నగదు, బంగారు ఆభరణాలను సీజ్​ చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే ఏ చర్యలనూ ఉపేక్షించడం లేదు. కార్లను మొదలుకొని ఆర్టీసీ బస్సులు, బైకులు ఇలా ఏ వాహనాన్నీ వదలకుండా చెక్​ చేస్తున్నారు. రూ.50 వేలకు మించి నగదు పట్టుబడితే సరైన పత్రాలు లేనిదే వదలడం లేదు. ఇలా ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, మద్యం, వివిధ కానుకలు పట్టుకుని సీజ్​ చేశారు.

Police Conduct Extensive Checking in Telangana : రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు.. పట్టుబడుతున్న నగదు, మద్యం, బంగారం

ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డబ్బు, మద్యం, ఆభరణాలు, కానుకలు, మాదక ద్రవ్యాల విలువ మొత్తం రూ.130 కోట్ల మార్కును దాటింది. ఇప్పటి వరకు అన్ని రకాలుగా లభించిన మొత్తం రూ.130 కోట్ల 26 లక్షల 91 వేల 531గా అధికారులు పేర్కొన్నారు. 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ ఉదయం వరకు రూ.21 కోట్ల 84 లక్షల 92 వేల 242 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.71 కోట్ల 55 లక్షల 58 వేల 94 నగదు పట్టుబడింది.

Police Impose Election Code Strictly in Telangana : పోలీసుల విస్తృత సోదాలు.. భారీగా పట్టుబడుతున్న అక్రమ నగదు, బంగారు ఆభరణాలు

52,091 లీటర్ల మద్యం, 1280 కిలోల నల్ల బెల్లం, 530 కిలోల ఆలం స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ మొత్తం రూ.ఏడు కోట్ల 75 లక్షల 79 వేల 917లుగా అధికారులు తెలిపారు. రూ.4 కోట్ల 58 లక్షల నాలుగు వేల 720 విలువైన 1694 కిలోల గంజాయి పట్టుబడింది. ఇప్పటి వరకు 72 కిలోలకు పైగా బంగారం, 420 కిలోలకు పైగా వెండి, 42 క్యారట్ల వజ్రాలు స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ మొత్తం రూ.40 కోట్ల ఎనిమిది లక్షల 44 వేల 300లుగా ఉంది. స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్​లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి మొదలైన కానుకల విలువ రూ.6 కోట్ల 29 లక్షల 4 వేల 500లుగా అధికారులు స్పష్టం చేశారు.

క్షుణ్నంగా తనిఖీ చేయండి..: ఇదిలా ఉండగా.. నారాయణపేట జిల్లాలోని చెక్ పోస్టులను కలెక్టర్ శ్రీహర్ష, ఎస్పీ యోగేశ్​ గౌతమ్ పరిశీలించారు. నారాయణపేట మండలం రాష్ట్ర సరిహద్దు గ్రామం జలాల్​పూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్​పోస్టును పరిశీలించారు. రాష్ట్రంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

50 Crore Worth Drugs seized at Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో.. రూ.50 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.