గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా కవాడిగూడి డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి కవిత మహేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో ఆమె ప్రచారం వాహనం దిగి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదే డివిజన్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రోడ్ షో నిర్వహిస్తుండడంతో కొద్దిసేపు ఆమెను నిలువరించారు.
పోలీసులు ఎంత చెప్పినా వినకుండా ఆమె భాజపా ర్యాలీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆపేశారు. భాజపా ప్రచార వాహనాలు ముందుకు వెళ్లాక ప్రచారాన్ని కొనసాగించాలని పోలీసులు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.