కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతుగా... పెట్రోల్, డీజిల్ నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు నిరసనగా రాజ్ భవన్ ఘెరావ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. లుంబినీ పార్క్ నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లి గవర్నర్కు వినతిపత్రం ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ పిలుపుతో పోలీసులు భారీగా మోహరించారు. రాజ్ భవన్, లుంబినీ పార్క్, పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
లుంబిని పార్క్ వద్దకు వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంత రావు, ఓబీసీ సెల్ ఛైర్మన్ కత్తి వెంకట స్వామి, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ నాయకులు బెల్లయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్రటేరియట్ వద్ద పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను అరెస్ట్ చేశారు. ఇప్పటికే వందలాది మంది కార్యకర్తలు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులను నిరసిస్తూ తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద బైఠాయించి కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: దేవినేని ఉమ అరెస్టు.. గొల్లపూడిలో టెన్షన్ టెన్షన్