అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీల ముగింపు వేడుకలు సికింద్రాబాద్ రైల్వే క్రీడా మైదానంలో నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న బ్యాండ్ పోటీల ముగింపు వేడుకలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంగీతం మన పూర్వ కాలం నుంచి వస్తుందని....కఠినమైన హృదయాన్ని కూడా కరిగించే శక్తి సంగీతానికే ఉందని తెలిపారు.
సంగీతం మనిషిలోని సృజనాత్మకతను బయటకు తీస్తుందని గుర్తుచేశారు. పూర్వ కాలంలో రాజుల ధీరత్వాన్ని వారి విజయాన్ని తెలపడం కోసం బ్యాండ్‌ను ఉపయోగించేవారని గుర్తుచేశారు. రిపబ్లిక్ డే రోజున మార్చ్‌లో పోలీస్ బ్యాండ్ వాయిస్తే మనలో ఉత్తేజం కలుగుతుందని పేర్కొన్నారు. మన యాస, భాష వేరైనప్పటికీ మనందరం భారతీయులమేనని వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల పోలీస్ బ్యాండ్లు ఆకర్షణీయంగా నిలిచాయి. బ్యాండ్ వాయించటంలో ప్రతిభ చూపిన బృందాలకు ఉపరాష్ట్రపతి మొమోంటోలు అందజేశారు.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: అధ్యక్షుడి పూర్తి షెడ్యూల్ ఇదే