హైదరాబాద్ నగరంలోని టప్పాచబుత్రను పొగాకు నిషేధిత బస్తీగా ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పంతో టప్పాచబుత్ర పోలీసులు స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు. టప్పాచబుత్రను కిందిస్థాయి నుంచి టొబాకో ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో కిరాణా దుకాణాలతో పాటు పాన్‌షాప్‌లను కట్టడి చేసే ప్రయత్నం చేశారు.
పొగాకు రహితంగా చేయాలంటూ పోలీసులు పాన్‌షాప్ యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు. గత వారం రోజులుగా పట్టుకున్న పొగాకును వారి ముందే కాల్చివేశారు. కార్యక్రమంలో సీఐ సంతోష్, ఎస్సై మధు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఈనెల 12నుంచి పట్టాలెక్కనున్న మరో 80 రైళ్లు