GHMC BJP Corporators Arrest: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం బుధవారం గందర గోళం, ఉద్యోగుల వాకౌట్, ఆ తరవాత సభ నిరావధిక వాయిదా వేయడం, బీజేపీ కార్పొరేటర్ల అరెస్టుతో ఉద్రిక్తతల మధ్య నడిచింది. సభను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ కౌన్సిల్ హాల్‌లో బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేయగా.. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. సభ వాయిదా అనంతరం హాల్‌లోనే కార్పొరేటర్లు బైఠాయించగా హాల్‌లో విద్యుత్ సరాఫరాను జీహెచ్ఎంసీ సిబ్బంది నిలిపివేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో వారు ప్రతిఘటించగా.. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
"కౌన్సిల్ సమావేశం తూతుమంత్రంగా నిర్వహించారు. మాకు జీహెచ్‌ఎంసీ అధికారులకు మధ్య గొడవలు సృష్టించి మేయర్ గారు మాయమయ్యారు. సుమారు 30లక్షల రూపాయాలు ఖర్చు పెట్టి కేవలం 15నిమిషాలలోనే సభను నిర్వహించి వాయిదా వేశారు. ప్రశ్నించిన వారిని ఈ ప్రభుత్వం అరెస్టు చేయాలని చూస్తోంది. ఈరోజు వాయిదా వేసిన సభను మరల ఎప్పుడు పెడతారో వెంటనే ప్రకటించాలి."- బీజేపీ కార్పొరేటర్
GHMC corporators meeting: జీహెచ్‌ఎంసీ అధికారుల వాకౌట్ చేయడంపై తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ మమత తాజాగా స్పందించారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు అధికారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. లేని పక్షంలో అధికారులుగా సహకరించమని హెచ్చరించారు. బీజేపీ కార్పొరేటర్లు అధికారుల పట్ల అనుచిత ధోరణికి నిరసనగా కౌన్సిల్ సమావేశం బై కాట్ చేసినట్లు ప్రకటించారు. మంగళవారం జలమండలి కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు అధికారులతో అనుచితంగా ప్రవర్తించారని ఆమె పేర్కొన్నారు.
కార్యాలయంలో సిల్ట్ వేయడం.. అధికారులపై అనుచితంగా మాట్లాడటంపై జీహెచ్ఎంసీ అధికారులు ఖండిస్తున్నట్లు తెలిపారు. జలమండలి అధికారులు మద్దతుగా కౌన్సిల్ సమావేశం బైకాట్ చేస్తున్నట్లు గుర్తు చేశారు. కార్పొరేటర్ల సమస్యలను సర్కిల్ నుంచి జోనల్ వరకు అధికారులు సమస్యలను విని సామరస్యంగా పరిష్కరించడం కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు కూడా కష్టపడి పనిచేస్తున్నారని.. అయినప్పటికీ అధికారులపై అనుచితంగా మాట్లాడటం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చేసిన పనికి అసలు గుర్తింపు లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఈ విధంగా ప్రవర్తించిన కార్పొరేట్లకు ఏ ఒక్క అధికారి కూడా సహకరించరని స్పష్టం చేశారు. ఇక నుంచైనా కార్పొరేటర్లు.. అధికారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని కోరారు.
ఇవీ చదవండి:
GHMC meeting: నిరసనలు.. వాకౌట్లతో.. GHMC కౌన్సిల్లో గందరగోళం
raghunandanrao: 'ప్రశ్నించడం షురూ చేశాక.. బెదిరింపులు కాల్స్ ఎక్కువయ్యాయి'
Crop Damage: 'అధైర్య పడొద్దు.. ఆందోళన అసలే వద్దు.. ప్రతి తడి గింజను ప్రభుత్వం కొంటుంది'