ETV Bharat / state

హరీశ్​ హత్య కేసులోను ఛేదించిన పోలీసులు.. ప్రేయసి అన్ననే నిందితుడు

Harish Murder Case Update: దూలపల్లిలో జరిగిన హరీశ్​ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమించిన యువతి సోదరుడే ఈ హత్యలో ప్రధాన నిందితునిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్యకు సహకరించిన మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

harish
హరీశ్​
author img

By

Published : Mar 5, 2023, 9:15 PM IST

PETBASHEERABAD MURDER CASE UPDATE: హైదరాబాద్​ శివారు ప్రాంతం దూలపల్లిలో జరిగిన పరువుహత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమించిన యువతి సోదరుడు దీన్​దయాల్​నే ప్రధాన నిందితునిగా దర్యాప్తులో పేర్కొన్నారు. దేవరకొండ హరీశ్​ బావ మరిదితో పాటు.. యువతి సోదరుడికి సహకరించిన మరో పది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్య కేసులో పోలీసులు పలు విషయాలను రిపోర్టులో పేర్కొన్నారు.

అసలేం జరిగింది: రెండు రోజుల క్రితం మేడ్చల్​ జిల్లా సూరారంలో నివాసం ఉంటున్న హరీశ్​ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఓ మహిళతో పాటు ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి కత్తులతో దారుణంగా నరికి చంపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తును వేగంగా చేశారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని భావించి.. ఆ కోణంలో విచారణను ముమ్మరం చేశారు.

పోలీసులు విచారిస్తున్న సమయంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో హరీశ్​ అమీర్​పేట్​లోని ఎల్లారెడ్డిగూడెంలో ఉంటున్నప్పుడు.. అక్కడే ఓ అమ్మాయిని ప్రేమించినట్లు స్థానికులు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో తన చెల్లి వెంట పడొద్దంటూ యువతి సోదరుడు హరీశ్​ను హెచ్చరించినట్లు తెలుసుకున్నారు. దీంతో హరీశ్​ కుటుంబం 6 నెలల క్రితం దూలపల్లిలోని సూరారం కాలనీకి మకాం మార్చారు.

అయినా ఇంకా తన అమ్మాయి వెంట పడుతున్నాడని యువతి కుటుంబ సభ్యులు పగ పెంచుకుని..ఎలాగైనా అంతం చేయాలని అనుకొని హత్య జరగడానికి రెండు రోజుల ముందు నుంచి హరీశ్​ కదలికలపై నిఘా పెట్టారు. అతను ఒంటరిగా ఉండడం చూసి అతి కిరాతకంగా హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. మొదటిగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని.. వారిని వివిధ కోణాల్లో ప్రశ్నించారు.

హరీశ్​తో గొడవపడిన యువతి సోదరుడు: హత్య జరగడానికి 6 నెలలు ముందు హరీశ్​తో యువతి సోదరుడు దీన్​దయాల్​ గొడవ పడ్డాడు. ఇంకోసారి తన చెల్లి జోలికి రావద్దని హెచ్చరించాడు. ఆ హెచ్చరికలను లెక్క చేయకుండా హరీశ్​, యువతి ఎప్పుడూ కలిసే వారు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు కూడా తెలియడంతో వారు సైతం హరీశ్​ను బెదిరించారు.

వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో వారు మరుసటిరోజు యువతి కళాశాలకు వెళ్లినప్పుడు వారు కలుసుకున్నారు. ఇరువురి ఇంట్లో వివాహానికి ఒప్పుకోరని చెప్పుకుని.. వారికి దూరంగా వెళ్లి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు. అప్పుడు ఈ విషయం మొత్తాన్ని హరీశ్​ తనకు నమ్మకం ఉన్న పుల్లయ్యకు తెలిపాడు. ఏదో ఒక ఉద్యోగం చూడాలని అతనిని ప్రాదేయపడ్డాడు. అందుకు అతను అంగీకరించి ఉద్యోగం చూశాడు. అయితే ఇతను కూడా హరీశ్​ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.