PM Modi Nizamabad Tour Schedule : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)నిజామాబాద్ పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ పర్యటనకు వస్తున్న ప్రధాని.. 3వ తేదీన నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. బీదర్ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2:55కి నిజామాబాద్‌కు చేరుకుంటారు. 3 గంటల నుంచి 3:35 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ప్రధాని చేయనున్నారు.
Prime Minister Narendra Modi Telangana Tour : ఆ కార్యక్రమం అనంతరం.. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభా స్థలికి చేరకుంటారు. 3:45 నుంచి 4:45 వరకు బహిరంగ సభలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పతకాలు, తెలంగాణకు కేటాయించిన నిధులు వివరిస్తూనే బీఆర్ఎస్ సర్కార్(BRS Government) వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ(Telangana Congress) అనుసరిస్తున్న ద్వంద వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ బహిరంగ సభను ముగించుకుని సాయంత్రం 5 గంటలకు నిజామబాద్ నుంచి హెలికాప్టర్‌లో బీదర్ బయలుదేరి వెళ్లనున్నారు.
Kishan Reddy on PM Modi Telangana Tour : 'నిజామాబాద్ సభలోనే తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావం'
PM Modi Mahabubnagar Tour Schedule : మరోవైపు ప్రధాని మోదీ మహబూబ్‌నగర్ పర్యటన షెడ్యూల్ రెండురోజుల క్రితమే ఖరారైన విషయం తెలిసిందే. మోదీ శంషాబాద్ అంతర్జాతీయ విమనాశ్రయానికి ప్రత్యేక విమానంలో అక్టోబర్ 1వ తేదీన మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయలుదేరనున్నారు.
BJP Public Meeting in Mahabubnagar : మధ్యాహ్నం 2:05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుని 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం పక్కనే ఉన్న బహిరంగ సభా స్థలికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకోనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమరభేరీ(Samara Bheri) సభలో పాల్గొని.. ఈ సభావేదిక నుంచే ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని మోదీ పూరించనున్నారు.
అలాగే సాయంత్రం 4 గంటలకు సభ ముగించుకుని హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4.45 గంటలకు దిల్లీకి తిరిగి పయనం కానున్నారు. మోదీ పర్యటన అనంతరం.. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి జాతీయ నాయకులు కూడా తెలంగాణ పర్యటనకు రానున్నారు. బస్సు యాత్ర(Bus Yatra) స్థానంలో ఇలా అసెంబ్లీ సెగ్మెంట్ల వద్ద జాతీయ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
Telangana BJP Plans For Assembly Election 2023 : ప్రధాని సభలకు భారీ జన సమీకరణపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళా బిల్లు ఆమోదం నేపథ్యంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) స్వయంగా పరిశీలిస్తుండగా.. మహబూబ్‌నగర్‌లో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(Laxman) పర్యవేక్షిస్తున్నారు.