ETV Bharat / state

ప్లాస్టిక్​ నిషేధం 'ప్రగతి'భవన్​ నుంచే...

author img

By

Published : Nov 15, 2019, 10:45 PM IST

ప్లాస్టిక్ నిషేధానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం... అందుకు తగ్గట్లుగా అడుగులు వేస్తోంది. అందరికి ఆదర్శంగా ఉండేలా ముఖ్యమంత్రి తన కార్యాలయం నుంచే ఇందుకు శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ సీసాల్లో మంచినీరుతో పాటు ప్లాస్టిక్ కవర్లను ప్రగతి భవన్​లో నిషేధించారు. వీలైనంత త్వరగా రాష్ట్రంలోనూ నిషేధం పూర్తి స్థాయిలో అమలుకు కసరత్తు మొదలైంది.

ప్రగతిభవన్​లో ప్లాస్టిక్​ సీసాలు, కవర్లు నిషేధం

ప్లాస్టిక్ నిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ, జీవకోటి మనుగడకే ముప్పుగా మారిన ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను రాష్ట్రంలో నిషేధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధానాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ రాష్ట్రంలో ప్లాస్టిక్​ను నిషేధించాలనే విషయమై విస్తృతంగా చర్చించారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు అధికారుల కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది.

సింగిల్ యూజ్

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం వల్ల వచ్చే సమస్యలు, ప్రత్యామ్నాయాలపై అధ్యయానికి కమిటీ ఏర్పాటు చేసిన సర్కార్... ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అవసరమైన సిఫారసులు చేయాలని కూడా కమిటీకి సూచించింది. వివిధ రాష్ట్రాల్లో నిషేధం అమలవుతున్న తీరును కూడా కమిటీ అధ్యయనం చేయనుంది.

కమిటీ ఏర్పాటు

అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, పురపాలక, పంచాయతీరాజ్, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులు, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ సభ్యులుగా, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి మెంబర్ కన్వీనర్​గా కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఒకమారు వాడి పారవేసే ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి అధికారుల కమిటీ కసరత్తు జరుపుతోంది. ఈ ప్రక్రియ ఓ వైపు జరుగుతుండగానే... ప్లాస్టిక్ నిషేధం దిశగా ముఖ్యమంత్రి కార్యాలయం శ్రీకారం చుట్టింది.

ప్లాస్టిక్​ సీసాలు

ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ప్రగతి భవన్​లో ప్లాస్టిక్ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రగతి భవన్​లో ప్లాస్టిక్ సీసాల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. ప్లాస్టిక్ సీసాలకు బదులుగా మంచినీటి కోసం రాగి సీసాలను ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం ప్రగతి భవన్​లో విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులకు రాగి సీసాలను సమకూర్చారు. ఒక్కొక్కరికి విడివిడిగా రాగి సీసాలు అందించారు. అతిథులు వస్తే కూడా వారి కోసం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

50 మైక్రాన్లకు తక్కువ

ప్లాస్టిక్ కవర్లను కూడా ప్రగతి భవన్​లోకి అనుమతించడం లేదు. అతిథులు, బయట నుంచి వచ్చే వారు ఎవరైనా తీసుకొస్తే భద్రతా సిబ్బంది అక్కడే ఆపేస్తున్నారు. ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అటు పురపాలక శాఖలో ప్లాస్టిక్ వినియోగించరాదని మంత్రి కేటీఆర్ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, కప్పులు, స్ట్రాలు, 50 మైక్రాన్లకు తక్కువ పరిణామంలో ఉన్న ప్లాస్టిక్ కవర్లను వినియోగించవద్దని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.