ఆరో విడత హరితహారంలో భాగంగా రసూల్‌పురాలోని మెట్రో రైల్‌భవన్ పరిసర ప్రాంతాల్లో సీనియర్ ఇంజనీర్లు, అధికారులతో కలిసి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మొక్కలు నాటారు. హరితహరం కార్యక్రమంలో భాగంగా హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు చెందిన వివిధ ప్రాంతాల్లో ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు నిర్ణయించినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. మెట్రో స్టేషన్లలో, కారిడార్ల వెంట, డిపో ప్రాంతాల్లో ఇప్పటికే మొక్కలు నాటుతుండగా, ప్రస్తుతం మెట్రో వయాడక్ట్ కింద, సెంట్రల్ మీడియన్‌లో పువ్వుల మొక్కలు పెంచుతున్నామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. గొల్లూరులోని 891 ఎకరాల్లో, హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు కేటాయించిన తుర్కయాంజల్‌లోని 142 ఎకరాల్లోని ఫారెస్ట్ బ్లాక్‌లలో వివిధ రకాలైన అటవీ జాతుల మొక్కలను పెంచనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి : పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం