బడ్జెట్లో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం పెంచటంతో వాటి ధరలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంతో వాహనదారులపై అదనపు భారం పడనుంది. పెరిగిన ధరలు శనివారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి రానున్నాయి. ఈ బడ్జెట్లోనైనా చమురు వినియోగదారులకు ఊరట కలుగుతుందనుకుంటే.. రేట్లు పెంచటం ఏంటని వాహన చోదకులు ప్రశ్నిస్తున్నారు. ధరలు అదుపు చేయటం మాని.. వినియోగదారుల నడ్డి విరిసేలా చర్యలున్నాయని ప్రజలు మండిపడుతున్నారు.
ఇదీ చూడండి: సమయానికి రాలేదని ఆరుగురు ఉపాధ్యాయులపై వేటు