ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్య్వవహరిస్తుందని శాసనసభ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ఎన్జీవోల సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ నేతృత్వంలో వీఆర్వోల సంఘం సభ్యులు బుధవారం.. హైదరాబాద్ సీతాఫలమండిలోని పద్మారావు గౌడ్‌ను ఆయన నివాసంలో కలిశారు. తమ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో విధులు నిర్వర్తిస్తోన్న వీఆర్వోల సమస్యలను డిప్యూటీ స్పీకర్‌కు సభ్యులు విపులీకరించారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. ఆయా అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పెద్దలతో చర్చిస్తానని పద్మారావు గౌడ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీఆర్వోల సంఘం నేతలు సతీష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దళారీ వ్యవస్థను తగ్గించి.. రైతులను ప్రోత్సహించండి: మంత్రి