ETV Bharat / state

వరవరరావును కలిసేందుకు కుటుంబసభ్యులకు అనుమతి

Permission for family members to meet varavararao
విరసం నేత వరవరరావును కలిసేందుకు కుటుంబసభ్యులకు అనుమతి
author img

By

Published : Jul 28, 2020, 8:15 PM IST

Updated : Jul 29, 2020, 5:10 AM IST

20:14 July 28

వరవరరావును కలిసేందుకు కుటుంబసభ్యులకు అనుమతి

ప్రముఖ కవి, రచయిత వరవరరావు (80)ను చూసేందుకు ఆయన కుటుంబసభ్యులకు బొంబాయి హైకోర్టు మంగళవారం అనుమతి మంజూరు చేసింది. కొవిడ్‌-19, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీమా కోరేగావ్‌ కేసులో అరెస్టై ముంబయిలోని తలోజా జైలులో ఉన్న ఆయనను అనారోగ్య కారణాల రీత్యా ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. వరవరరావు బెయిలు పిటిషన్‌పై గతంలో వాదనలు వినిపించిన ఆయన తరఫు న్యాయవాది.. కుటుంబసభ్యులు కొవిడ్‌-19 జాగ్రత్తలు తీసుకుంటారని, దూరం నుంచే చూస్తారని న్యాయస్థానానికి హామీఇచ్చారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ, ప్రభుత్వ న్యాయవాదులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో జస్టిస్‌ ఆర్‌.డి.ధనౌక, జస్టిస్‌ వి.జి.బిస్త్‌ల ధర్మాసనం మంగళవారం అనుమతి మంజూరు చేసింది. ఆసుపత్రి వర్గాల అనుమతి లభించిన వెంటనే ముంబయి బయలు దేరుతామని హైదరాబాద్‌లో ఉన్న వరవరరావు కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఇదీచూడండి: ఆయన ప్రాణం కాపాడండి: వరవరరావు సతీమణి హేమలత

Last Updated : Jul 29, 2020, 5:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.