హైదరాబాద్ అమీర్‌పేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు కోసం ప్రజలు బారులుతీరారు. ఈ బుధవారం వరకు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ లేకుండానే వ్యాక్సిన్ ఇస్తుండటంతో పెద్దసంఖ్యలో జనాలు ఆరోగ్య కేంద్రానికి తరలివచ్చారు.
ఉదయం నుంచే ఆరోగ్య కేంద్రం వద్ద లైన్లలో నిల్చున్నారు. ఇవాళ సుమారు 350 మందికి టీకా రెండో డోసు ఇవ్వనున్నట్లు ఆస్పత్రి వైద్యాధికారి రేవతి పేర్కొన్నారు. ఇందులో 200 మందికి కొవిషీల్డ్, 150 మందికి కొవాగ్జిన్ టీకాలివ్వనున్నట్లు వివరించారు. వ్యాక్సిన్ కోసం ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో స్థానిక పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇదీ చూడండి.. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వైరస్ ప్రభావం తక్కువే...