జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. రేపు ఒక్క రోజు అందరూ తమ ఇంట్లోనే ఉండి స్వీయ నియంత్రణ పాటించాలని సీపీ కోరారు. కుటుంబ సభ్యులెవ్వరూ.. బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నియత్రించేందుకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ప్రజలంతా సహకరించాలన్నారు.
ఇదీ చూడండి : 'జనతా కర్ఫ్యూను జయప్రదం చేద్దాం'