కాంక్రీట్ జంగిల్ లాంటి మహానగరంలో... హైదరాబాద్ రాజేంద్రనగర్ శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్రాక్ష పరిశోధన స్థానం ప్రాంగణంలో... ఇవాళ్టి నుంచి వారం రోజులపాటు గ్రేప్ ఫెస్టివల్ జరగనుంది. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన ఈ పండుగకు... తొలి రోజు నుంచే నగరవాసులు తరలి వచ్చారు.
ద్రాక్ష తోటలను సందర్శించి... స్వయంగా ద్రాక్ష రుచులు చూస్తూ... చెట్టు నుంచి కోసుకుంటూ కొనుగోలు చేసి వెళ్తున్నారు. ద్రాక్ష పరిశోధన స్థానంలో... శాస్త్రవేత్తల పర్యవేక్షణలో పరిశోధనల కోసం వృద్ధి చేసి... తోటలో కాపు వచ్చాక వేలం వేయడం ఆనవాయితీ. మూడేళ్లుగా స్థానిక యువకులు వేలంలో పాల్గొని కాపు సొంతం చేసుకుంటున్నారు.
ఉత్పత్తులను బహిరంగ మార్కెట్‌లో విక్రయించకుండా వినియోగదారులే స్వయంగా క్షేత్రానికి విచ్చేసి పండ్లు కోసి తూకం వేయించుకుని వెళ్లేలా ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తామే తోటలోకి వెళ్లి ద్రాక్ష పండ్లు కోసుకోవడం చక్కటి అనుభూతి ఇచ్చిందని... గ్రేప్ ఫెస్టివల్ చాలా బాగుందని సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు