Pensioners Problems : ఏపీలోని విజయవాడ గాంధీనగర్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ విరమణ పొందిన వృద్ధులు పింఛను కోసం ప్రతీ ఏటా జీవిత ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు పింఛనుదారులు వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గంటల తరబడి క్యూలైన్‌లో వేచిచూడాల్సి వస్తోందని.. కనీస సౌకర్యాలు ఉండటం లేదని వారంతా వాపోతున్నారు. వేలిముద్రలు పడని వారు, ఐరీస్ గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు వీరు ప్రైవేటు ఆన్‌లైన్ సేవల మీద ఆధారపడాల్సి వస్తోంది.
"ఇక్కడికి వచ్చిన వారు వృద్ధ్యాప్యం మీద పడినవారే. సరైన సౌకర్యాలు లేవు. వేలి ముద్రలు ఇవ్వాలంటే క్యూలైన్‌లో నిల్చోవాల్సి వస్తోంది. కనీసం కూర్చోటానికి బెంచీలు లేవు. వేలి ముద్రలు పడని వారు ప్రైవేటు సేవల ద్వార ఐరీస్ ఇస్తున్నారు. వారు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు." - పింఛనుదారు
వేలిముద్రలు, ఐరీస్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పింఛన్ దారులు చెబుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఐరీస్ ధ్రువీకరణ ఇవ్వడానికి అందినకాడికి దోచుకుంటున్నారని వీరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ధ్రువీకరణకు సదుపాయాలు ఒకే చోట కల్పిస్తే వ్యయప్రయాసలు తగ్గుతాయని పెన్షన్‌దారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
"నేను వేలిముద్ర ఇవ్వటానికి వచ్చాను. ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి ఉంటుంది. వేలిముద్ర వేయటానికి వస్తే వేలి పడలేదు. బయటకు వెళ్లి ఐరీస్ ఇవ్వమని ఇక్కడ చెబుతున్నారు. మాకు వచ్చే పింఛన్ పైనే మేము ఆధారపడి జీవిస్తాము. ఇప్పుడు వచ్చే కొద్ది మొత్తం నగదులో ఇలా ఖర్చు చేస్తే ఎలా బతకాలి." -పింఛనుదారు
ఇవీ చదవండి: