ETV Bharat / state

‘అమ్మాయిలకు మాత్రమే’: కాఫీషాపులు.. జిమ్‌లు.. మీటింగ్‌ ప్లేసులు - hydarabad district latest news

కాఫీషాపులు.. జిమ్‌లు.. మీటింగ్‌ ప్లేసులు అన్నీ మగవాళ్ల ప్రపంచంలానే అనిపిస్తాయి. అందుకే అక్కడ అడుగుపెట్టడానికి మహిళలు మొహమాటపడతారు. అదే..‘అమ్మాయిలకు మాత్రమే’ కేఫ్‌, జిమ్‌, స్టడీసెంటర్ ‌వంటివి ఉంటే బాగుంటుంది కదా! హైదరాబాద్‌కి చెందిన అబీదా ఫాతిమాకి కూడా ఇదే ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా మహిళల కోసం ప్రత్యేకంగా ‘పెర్ల్‌ స్క్వేర్‌’ హబ్‌ని ప్రారంభించింది.

Pearl Square hub
‘పెర్ల్‌ స్క్వేర్‌’ హబ్​
author img

By

Published : Mar 31, 2021, 8:46 AM IST

హైదరాబాద్‌లోని టోలీచౌకీలో ఉంది పెర్ల్‌స్క్వేర్‌ భవనం. ఇక్కడ మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆఫీస్‌ అయిపోయిన తర్వాత కాసేపు సేద తీరాలనుకునేవారు.. తీరిగ్గా చాయ్‌ తాగుతూ సమోసా తింటూ చక్కని చర్చలు చేయాలనుకునే వారికి ఇది మంచి వేదిక. ఇంట్లో చదువుకోవడానికి సదుపాయం లేని విద్యార్థినులు ఇక్కడ స్టడీ రూమ్‌లో చదువుకోవచ్చు. ఉద్యోగినులు పనిచేసుకోవడానికి వీలుగా వర్క్‌స్టేషన్లు సైతం ఉన్నాయి. కిట్టీ పార్టీలు పెట్టుకోవాలంటే పైన టెర్రస్‌ గార్డెన్‌ సిద్ధంగా ఉంది. ఇక కసరత్తులు చేయాలనుకునే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా వ్యాయామశాల ఉంది. ఇవి మాత్రమే కాదు లైబ్రరీ, బ్యూటీపార్లర్‌, బొటిక్‌, కేఫ్‌ అండ్‌ స్నాక్స్‌ కార్నర్‌ కూడా ఉన్నాయి. మహిళలు ఇళ్లలో తయారు చేసిన ఆహార పదార్థాలని ఈ కేఫ్‌లో విక్రయించుకునే అవకాశం ఉంది. ఇందులో స్టడీరూమ్‌, జిమ్‌ వంటి ఎంపిక చేసిన సేవలకోసం మాత్రం సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది.

ఆడవాళ్లకు మాత్రమే..!
వ్యాయామశాల

టోలిచౌకీలో ఉండే ఫాతిమా బీకామ్‌ పూర్తి చేసిన తర్వాత మహిళా సమస్యలపై పోరాడే ఓ స్వచ్ఛంద సంస్థలో కొన్ని రోజులు వాలంటీర్‌గా పని చేసింది. ఆ సమయంలోనే ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దృష్టి పెట్టింది.

‘రోజంతా ఎన్నో పనులు చేసి చిన్న విరామం కోసం ఏ కెఫేలో అయినా అడుగుపెడదామంటే చుట్టూ మగవాళ్లు. కప్పు కాఫీ తాగాలన్నా ఇబ్బందే. అప్పుడే అనుకున్నా మహిళలు సేదతీరేందుకు ఒక హబ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని. నా స్నేహితురాళ్లు, బంధువులతో చెబితే వాళ్లూ ప్రోత్సహించారు. టోలీచౌకీలోని ఆదిత్యనగర్‌లో ఉన్న ఓ పెద్ద భవనాన్ని అద్దెకు తీసుకుని ‘పెర్ల్‌ స్క్వేర్‌’ను ఏర్పాటు చేశాను.’ అంటోంది ఫాతిమా.

ఇదీ చూడండి: సీఎం ఓఎస్డీ పేరుతో మోసాలు.. రూ.3 కోట్లకు టోకరా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.