వరుస నేరాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులపై సైబరాబాద్ పోలీసులు కన్నెర్ర చేశారు. బండ్లగూడలోని కిస్మత్‌పూర్‌కు చెందిన షేక్ ఇర్ఫాన్ అహ్మద్, బోరబండ వాసి మహ్మద్ రబ్బానీ, చంద్రాయణగుట్టలో నివాసం ఉంటున్న షేక్ తాజుద్దీన్, షేక్ మెహరాజ్‌లపై పీడీ చట్టం ప్రయోగించారు.
వ్యసనాలకు బానిసలై తరచూ చోరీలు చేసేవారని పోలీసులు తెలిపారు. సైబరాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆదేశాలతో పీడీ చట్టం నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీచూడండి: మీమున్నామన్న పోలీసులు