ETV Bharat / state

తెరాస చెప్పే అబద్ధాలను బహిర్గతం చేస్తాం: గూడూరు నారాయణ రెడ్డి - GHMC elections 2020

తెరాస ప్రభుత్వ చెప్తున్న అవాస్తవాలను కాంగ్రెస్ బహిర్గతం చేస్తుందని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్​ అభివృద్ధికి రూ.67 వేల కోట్లు ఖర్చు చేశామన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

pcc-treasurer-guduru-narayana-reddy-serious-on-ktr-statements-about-hyderabad-development
తెరాస చెప్పే అబద్ధాలను బహిర్గతం చేస్తాం: గూడూరు నారాయణ రెడ్డి
author img

By

Published : Nov 22, 2020, 7:58 AM IST

హైదరాబాద్ అభివృద్ధి నివేదికను మంత్రి కేటీఆర్ వక్రీకరించి... అవాస్తవాలను మాట్లాడుతున్నారని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ విడుదల చేసిన హైదరాబాద్ అభివృద్ధి నివేదిక.. అబద్ధాలకు అద్దంపడుతుందని ఎద్దేవా చేశారు.

గడిచిన ఆరున్నర సంవత్సరాల్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.67,000 కోట్లు వ్యయం చేశామన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వివిధ ప్రాజెక్టులకు ఖర్చు చేసిన మొత్తాన్ని చూపించారని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టులను ప్రారంభించిన తేదీలను, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని చూపలేదన్నారు. హైదరాబాద్ సుందరీకరణ కోసం అనేక ప్రాజెక్టులను చేపట్టింది కాంగ్రెస్ కాదా అంటూ ప్రశ్నించారు.

అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్ఆర్ ఎక్స్​ప్రెస్ వే, మెట్రో రైల్ వచ్చింది కాంగ్రెస్​ పాలనలోనిదేనంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్​కు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనలో ప్రారంభించిన విషయాన్ని ఎందుకు దాచారంటూ మండిపడ్డారు. 2007 సంవత్సరంలో ఎంసీహెచ్​ను గ్రేటర్ జీహెచ్ఎంసీగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని... నగర అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. తెరాస ప్రభుత్వ అవాస్తవాలను కాంగ్రెస్ పార్టీ బహిర్గతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: దుబ్బాక దెబ్బ నుంచి కేటీఆర్ ఇంకా కోలుకోనట్టున్నారు: లక్ష్మణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.