సినీ ప్రముఖులకు సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో దర్యాప్తుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కు ఎక్సైజ్ శాఖ సహకరించడం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని... ఈ వ్యవహారంలో ఈడీ విచారణ చేయడానికి సిద్దంగా ఉన్నప్పటికీ ఎక్సైజ్ శాఖ దర్యాప్తు సంస్థకు ఎందుకు సహకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ శాఖ దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నప్పటికీ ఈడీకి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఈ కేసులో సరఫరా చేసే వాళ్లు, వాడిన వాళ్లు, విక్రయించిన వారు ఇలా మూడు రకాల నేరస్థులున్నారన్నారు. ఈ కేసును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్వతంత్రంగా విచారణ చేయాలని ఆయన కోరారు. ఈడీకి సహకరించి అన్నీ ఆధారాలు, సాక్ష్యాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం పాటించడం లేదని దుయ్యబట్టారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి మాదకద్రవ్యాల కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని.. ఎక్సైజ్ శాఖ సహకరించడం లేదని... ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ముందు ఆయన మాట్లాడారు
డ్రగ్స్ సరఫదారులపై ఉక్కుపాదం మోపుదామంటే మీరెందుకు సహరిచడం లేదు. మీరు ఏర్పాటు చేసిన స్పెషన్ ఇన్వేస్చిగేషన్ టీమ్ సేకరించిన డిజిటల్ డేటాను ఈడీకీ ఎందుకిస్తలేరు. మీకున్న భయమేంది? మీకున్నా అభ్యంతరాలేంది? మీకు ఎవరినీ కాపాడేందుకు సమాచారాన్ని తొక్కి పెడుతున్నారు. ఎవరీ గుట్టురట్టవుతుందని మీరు భయపడుతున్నారు. - రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం
డ్రగ్స్ కేసుపై అన్నీ విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసినా కూడా ముందుకు రాలేదని.. హైకోర్టుకు కూడా వెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ యువతను, ప్రజలను డ్రగ్స్ నుంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నైజీరియా నుంచి వచ్చిన వాళ్లు రాజ్యమేలుతున్నారని అన్నారు.
ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదు
ఈడీ విచారణకు సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని చెప్పిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ దగ్గర అన్నీ ఆధారాలు ఉన్నా.. ఈడీకి ఎందుకివ్వట్లేదని ప్రశ్నించారు. ఇతర దేశాల నుంచి గుజరాత్, ముంబై పోర్టులలో 100 క్వింటాళ్ల డ్రగ్స్ పట్టుబడుతున్నా కూడా వ్యవస్థికృత నేరానికి పాల్పడుతున్నారు. మీరు సేకరించిన అన్నీ ఆధారాలు, సాక్ష్యాలు, వెంటనే ఈడీకి ఇచ్చి సహకరించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి కాలనీ ఘటనకు మత్తే కారణం
సింగరేణి కాలనీలో జరిగిన బాలిక అత్యాచారం గంజాయి మత్తులో చేసింది కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధూల్‌పేట్‌లోని గుడుంబా స్థావరాలపై దాడులు చేసి.. వారికీ ఎలాంటి ప్రత్యామ్నాయం కల్పించలేదన్నారు. అందుకే వాళ్లు గంజాయి అమ్ముతున్నారని తెలిపారు.
వైట్ ఛాలెంజ్ విసిరితే కోర్టుకెళ్లారు
కేటీఆర్‌కు మేము వైట్ చాలాంజ్ విసిరితే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మీరు సేకరించిన డేటా, ఆధారాలు, ఈడీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. మీ భయానికి గల కారణాలు ఏంటి? మీరు ఎవరిని కాపాడాలని చూస్తున్నారని ప్రశ్నించారు. టోనీకి సంబంధించిన డిజిటల్ డేటా ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు.
ఇదీ చూడండి: