సచివాలయం పాత భవనాలను కూల్చివేతపై పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ చర్య చాలా బాధ కలిగించిందన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ సచివాలయం భవనాలను కూల్చివేత అనేది చాలా దుర్మార్గమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా కరోనాపై దృష్టి పెడుతుంటే ఇక్కడ సచివాలయ భవనాలు కూల్చివేస్తున్నారని... ఇది సరైంది కాదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని ఉత్తమ్ విమర్శించారు. హైదరాబాద్లో కరోనా విజృంభిస్తుంటే సీఎం ఎక్కడికి వెళ్లారంటూ ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. పెద్ద సంఖ్యంలో కరోనా పరీక్షలు చేయాలని కోరుతున్నాం కానీ... ప్రభుత్వం మా మాటలను పెడచెవిన పెట్టిందంటూ వ్యాఖ్యానించారు. పాజిటివ్ కేసులు, మరణాలను ప్రభుత్వం తక్కువ సంఖ్యగా చూపుతోందన్నారు. ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చకపోతే ఉద్యమిస్తామని ఉత్తమ్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: కొనసాగుతున్న సచివాలయ భవనాల కూల్చివేత