ETV Bharat / state

యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారు: ఉత్తమ్​ - యువజన కాంగ్రెస్​ నాయకులతో సమావేశం

రాష్ట్ర ఏర్పాటులో కీల‌క‌పాత్ర పోషించిన యువ‌త తెరాస ప్ర‌భుత్వ హయాంలో తీవ్రంగా న‌ష్టపోయింద‌ని పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. యువ‌జ‌న కాంగ్రెస్ క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తే భ‌విష్య‌త్తు మ‌న‌దేన‌ని ఆయ‌న అన్నారు. జూమ్ ఆప్ ద్వారా యువ‌జ‌న కాంగ్రెస్ నాయ‌కుల‌తో స‌మావేశ‌మైన ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి.. వారికి దిశానిర్దేశం చేశారు.

pcc-chief-uttam-kumar-reddy-comments-on-trs-and-bjp
యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారు: ఉత్తమ్​
author img

By

Published : Mar 10, 2021, 4:27 AM IST

నిరుద్యోగ భృతి ఇస్తామని యువతను మోసం చేసిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. యువజన కాంగ్రెస్​ కష్టపడి పనిచేస్తే భవిష్యత్తు మనదేనని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూమ్ ఆప్ ద్వారా యువ‌జ‌న కాంగ్రెస్ నాయ‌కుల‌తో స‌మావేశ‌మైన ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో యువ‌జ‌న కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల పాత్ర కీల‌క‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

యువ‌త‌కు ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్, మోదీ మోసం చేశార‌ని ఉత్తమ్​ ఆరోపించారు. బిశ్వాల్ క‌మిటీ ఇచ్చిన పీఆర్సీ నివేదికలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల్సిన‌ రాష్ట్ర స‌ర్వీస్ క‌మిష‌న్‌లో కేవ‌లం ఇద్దరు స‌భ్యులు మాత్ర‌మే ఉన్నార‌ని తెలిపారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన‌ రాములు నాయక్‌ను అభ్యర్థిగా నిలిపామ‌న్నారు. రాష్ట్రం కోసం కీల‌కంగా ప‌ని చేశార‌ని.. అంద‌రు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేసి ఆయ‌న గెలుపున‌కు కృషి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కాంగ్రెస్ ఓట్లు చీల్చడం ద్వారా తెరాసకు లబ్ధి చేసేందుకే స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో ఉన్నార‌ని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యువ‌జ‌న కాంగ్రెస్ అధ్య‌క్షుడు శివ‌సేనారెడ్డిల‌తోపాటు అన్ని జిల్లాలు, అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల ఇంఛార్జిలు, మండ‌ల అధ్య‌క్షులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఈనెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.