దేశంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు... ఉచితంగా ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. వ్యాక్సినేషన్ వేగం పెంచాలంటూ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్‌కు వినతి పత్రం అందించారు.
తెలంగాణలో... కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 7వ తేదీన అన్ని జిల్లాల్లో సత్యాగ్రహం చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా బాధితులు ప్రైవేటు ఆసుపత్రులకు అధికంగా చెల్లించిన డబ్బు... తిరిగి ఇప్పించాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు.
ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల హోంశాఖలపై తెలంగాణ హైకోర్టు అసహనం