నేను కూడా సెటిలర్నే . నాది కొండారెడ్డిపల్లి గ్రామం.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉంటున్నా. సొంతూరు దాటితే ఎక్కడికి వెళ్లినా సెటిలర్లమే. సెటిలర్లను బెదిరింపు, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే వారికి కచ్చితంగా అండగా ఉంటా. అనుకూలంగానో, వ్యతిరేకంగానో కాకుండా న్యాయం ఎవరి వైపు ఉంటే వారి వైపే ఉంటా. తెలంగాణలో ఉండే ఎవరైనా సరే వారు మన రాష్ట్రం వారే.. తెలుగు వారు అమెరికాలో ఎంతో మంది ఉన్నారు. అమెరికా వాళ్లు మన వాళ్లను అలా ఏమి అనడం లేదు. హైదరాబాద్ అయినా.. ఏ ఊరైనా తేడా ఉండదు. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇదే తెరాస పార్టీ అజెండా. నీళ్లలోనే నిధులను చూస్తున్నారు కేసీఆర్. నిధులు కావాల్సినప్పుడల్లా నీళ్ల టెండర్లు పిలవాలే.. నిధులు సంపాదించుకోవాలే. ఓట్లు కావాలన్నా, నిధులు కావాలన్నా నీళ్లే ఆయనకు దిక్కు. నీళ్లు ఆయనకు ఆదాయ వనరు. కేసీఆర్‌కు కుటుంబ తగాదాల వల్ల కంటి మీద కునుకులేని పరిస్థితులొచ్చాయి. వీటన్నింటి నుంచి బయటికి రావాలంటే మరొక భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలి.
-రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
రేవంత్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి
ఇదీ చదవండి: REVANTH REDDY: 'రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా కాంగ్రెస్ సిద్ధమే'