తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని బిహార్‌లా మార్చే ప్రయత్నం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి (pcc chief revanth reddy) మండిపడ్డారు. నిన్న తన ఇంటిపై తెరాస శ్రేణులు దాడి చేసిన విషయాన్ని జూబ్లీహిల్స్ డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. తమపైనే దాడిచేసి కేసులు పెట్టడం అన్యాయమని రేవంత్‌రెడ్డి (pcc chief revanth reddy) ప్రశ్నించారు. పోలీసులు తాము ఫిర్యాదు చేయలేదని చెప్పడం సరికాదన్నారు. వాళ్ల కళ్ల ముందే దాడి జరిగితే ఫిర్యాదు చేయలేదంటున్నారని.. డయల్ 100కు ఫోన్‌చేసినా స్పందించాల్సిన పోలీసులు.. ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరించడం తగదన్నారు.
దాడి చేసిన తెరాస కార్యకర్తలపై కేసులు పెట్టలేదు. కాంగ్రెస్ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టారు. ప్రాణహాని ఉందన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. అదనపు భద్రత కల్పించాలని కోర్టు చెప్పింది. కోర్టు చెప్పినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అదనపు భద్రత కల్పించాలని మళ్లీ కోర్టుకు వెళ్తా. కేసీఆర్ ఒత్తిడితో కోర్టు ఆదేశాలు కేంద్రం అమలు చేయడం లేదు. రాష్ట్రాన్ని బిహార్‌గా మార్చాలని కేసీఆర్ చూస్తున్నారు. తెరాసకు వత్తాసుపలికే అధికారుల పేర్లు డైరీలో రాసిపెట్టుకుంటాం. అధికారంలోకి వచ్చాక నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటాం.
-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
తనకు అదనపు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదన్నారు. గతంలోనూ గుర్తుతెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారని.. రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా విచారణ చేయలేదని... ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని రేవంత్‌రెడ్డి (pcc chief revanth reddy)ఆరోపించారు.
ఇదీ చూడండి: KTR Defamation Suit On Revanth: 'డ్రగ్స్ కేసుతో ముడిపెట్టి కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేయవద్దని ఉత్తర్వులు'