జనసేన అధినేత పవన్ కల్యాణ్.... భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ముందే నిర్ధరించిన షెడ్యూల్ ప్రకారం... శనివారం రాత్రే సమావేశం కావాల్సి ఉన్నా... ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి కిందట.... నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్...... జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న దాడులు, రాజధాని మార్పు, అస్పష్టమైన ప్రకటనలు, ప్రజల్లో నెలకొన్న సందిగ్ధత వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఇవీ చూడండి:పక్షాల భేటీకి బీఎస్పీ, తృణమూల్, ఆప్ దూరం