ETV Bharat / state

'తితిదే ఆస్తులను నిరర్థకం అనడం దాతలను అవమానించడమే' - తమళినాడు టీటీడీ ఆస్తుల అమ్మకం న్యూస్

తితిదే ఆస్తులను నిరర్థకం అనడం దాతలను అవమానించడమేనని జనసేన అధినేత పవన్‌ అన్నారు. తితిదే ఆస్తులను భగవంతుడి సేవకు వినియోగించాలని కోరారు.

pawan-kalyan-on-sale-of-ttd-assets
'తితిదే ఆస్తులను నిరర్థకం అనడం దాతలను అవమానించడమే'
author img

By

Published : May 25, 2020, 5:40 PM IST

స్వామివారి ఆస్తులను హిందూధర్మ ప్రచారం కోసం వినియోగించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శ్రీవారి ఆస్తులు సహా దేవాలయాల ఆస్తులను అంగట్లో ఉంచుతారా? అని ప్రశ్నించారు. ఆలయ నిర్వహణకు నిధుల కొరత అనేది ఎన్నడూ లేదని పవన్ గుర్తు చేశారు. డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే తితిదే అనేక పనులు చేయవచ్చని పేర్కొన్నారు. నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరాళాలు ఇస్తూనే ఉన్నారన్న పవన్.. పొరుగు రాష్ట్రాల్లోని ఆస్తుల నిర్వహణ కష్టమనే మాటలను నమ్మలేమన్నారు. పొరుగు రాష్ట్రాల్లో తితిదే కార్యాలయాలు, ధర్మ ప్రచార పరిషత్తులు ఉన్నాయని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: బల్బీర్ ఆట చిరస్మరణీయం.. వ్యక్తిత్వం అనుసరణీయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.