Janasena: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారం ఉపయోగిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వేపనపల్లి అనే గ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో జశ్వంత్ అనే యువకుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవటంపై స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే.. అతనితో పాటు మరో తొమ్మిది మంది జన సైనికులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. ఇలా సమస్యలపై ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని పవన్ ప్రశ్నించారు.
Pawan fire on YSRCP: ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా రిమాండ్కు తీసుకెళ్లిన పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. న్యాయమూర్తి రిమాండు రిపోర్టును రిజెక్టు చేసినా.. ఆ యువకుల్ని ఈ కేసులో ఏదో రకంగా ఇరికించాలని నాయకులు, పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రశ్నించినంత మాత్రానా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వేధిస్తాం అంటే ఎలా ? అని నిలదీశారు. నిజంగా ఆ యువకులు పరిధి దాటి ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా ? అని మండిపడ్డారు. ఇలా అకారణంగా ప్రశ్నించిన వారిని వేధించటం అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ విషయాన్ని మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పవన్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: